Amazon Smbhav 2024: క్విక్ కామర్స్‌లోకి అమెజాన్.. ఇక 15 నిమిషాల్లోనే డెలివరీ!

Amazon India Set To Enter Soon In Quick Commerce
షార్ట్స్‌లో చూడండి
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పుడు తన సేవలను మరింత విస్తరించే పనిలో పడింది. ‘క్విక్ కామర్స్’లో ఉన్న స్పేస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా త్వరలోనే ఇందులోకి దిగాలని భావిస్తోంది. మరో నెల రోజుల్లో బెంగళూరు కేంద్రంగా పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించనుంది. ఇవి అందుబాటులోకి వస్తే ఇక 15 నిమిషాల్లోనే కోరుకున్న వస్తువులు ఇంట్లో ఉంటాయి. 

న్యూఢిల్లీలోని భారత మండపంలో మంగళవారం నిర్వహించిన ‘అమెజాన్ సంభవ్ 2004’ 5వ ఎడిషన్‌‌లో అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని ప్రతి పిన్‌కోడ్ (ప్రతి గ్రామానికి)కు విలువైన, వేగవంతమైన సేవలను అందించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. బుక్ చేసుకున్న 15 నిమిషాలు, లేదంటే అంతకంటే ముందే వస్తువులను డెలివరీ చేయనున్నట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి ఇతర నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. 

ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్
దేశంలోని క్విక్ కామర్స్ రంగంలో ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం రిటైల్ పంపిణీ కేంద్రమైన డార్క్ స్టోర్ల బలమైన నెట్‌వర్క్ చుట్టూ ఈ మోడల్ పనిచేస్తుంది. ‘అమెజాన్ ఫ్రెష్’ ద్వారా అమెజాన్ ఇప్పటికే పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, సరుకులను రెండు గంటల్లోనే అందిస్తోంది. అయితే, పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకుమించిన వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. 
Go Back to Shorts
Amazon Smbhav 2024
Quick Commerce
Amazon India
Samir Kumar

More Telugu News