మహా సీఎంపై వీడిన సస్పెన్స్.. ఫడ్నవీసే సీఎం
- బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ఎన్నిక
- రేపు ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం
- అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్) పార్టీలు మహాయుతి కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. కూటమికి మొత్తం 233 సీట్లు దక్కగా.. అందులో బీజేపీ సింగిల్ గానే 132 సీట్లు గెలుచుకుంది. దీంతో మరోసారి సీఎం పదవిని చేపట్టాలని ఏక్ నాథ్ షిండే భావించగా.. కూటమిలో అత్యధిక సీట్లు గెల్చుకున్న తమకే సీఎం సీటు దక్కాలని బీజేపీ పట్టుబట్టింది. సీఎం సీటును ఈసారి వదులుకోబోమని, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ విషయంపై కూటమిలో పలు భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టేందుకు కూటమి పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం.