వారిని జైలుకు పంపిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు: హరీశ్ రావు
- ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలని ఆగ్రహం
- వాంకిడి మరువకముందే మాగనూరులోనూ ఫుడ్ పాయిజన్ అయిందన్న హరీశ్ రావు
- ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్న మాజీ మంత్రి
వాంకిడిలో వందమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై పది రోజులు కూడా గడవలేదని, ఇప్పుడు మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసిందన్నారు. 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ... కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు.