గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించాం: పవన్ కల్యాణ్
- గజేంద్రసింగ్ షెకావత్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్న పవన్
- తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య
- రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్న పవన్
ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని పవన్ వెల్లడించారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గజేంద్రసింగ్ ను కోరామని చెప్పారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి, కేంద్ర పంచాయతీ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు.

