బీహార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది: ప్రశాంత్ కిశోర్

25-11-2024 Mon 12:03 | National
Advertisement
  • బీహార్ ఒక విఫల రాష్ట్రం అన్న ప్రశాంత్ కిశోర్
  • బీహార్ ను అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • 2025లో తమ పార్టీ జన్ సురాజ్ పక్కాగా గెలుస్తుందని ధీమా
Advertisement
బీహార్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఒక విఫల రాష్ట్రమని అన్నారు. అమెరికాలోని బిహారీ ప్రవాసులతో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ... బీహార్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని అన్నారు. బీహార్ ను అభివృద్ధి వైపు నడపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకవేళ బీహార్ ఒక దేశమైతే... జనాభా పరంగా ప్రపంచంలో 11వ అతిపెద్ద దేశమవుతుందని తెలిపారు. జనాభా పరంగా జపాన్ ను బిహార్ దాటేసిందని చెప్పారు. 

2025లో బీహార్ లో జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే... పాఠశాల విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ... తమ పార్టీపై ఆశాజనకంగానే ఉన్నామని తెలిపారు. 2025లో జన్ సురాజ్ పక్కాగా గెలుస్తుందని చెప్పారు. 2029-30 నాటికి బీహార్ ను ఆదాయ రాష్ట్రంగా మార్చడం ఒక సవాలు అని అన్నారు. అంకితభావంతో పని చేస్తే ఏదైనా సాధ్యమేనని  చెప్పారు.
Advertisement
Prashant KishorBihar

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more