ఓలా స్కూటర్ రిపేరుకు రూ.90 వేలు... కోపం రాకుండా ఎలా ఉంటుంది?

Angry man hammered Ola scooter in a viral video
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పెద్ద సుత్తితో కసిదీరా ఓలా స్కూటర్ ను ముక్కలు చేసిన వ్యక్తి
  • ఇటీవల కాలంలో తరచుగా ఓలా స్కూటర్లలో లోపాలు!
భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం మొదలయ్యాక ఓలా స్కూటర్లు బాగా అమ్ముడుపోయాయి. మొదట్లో ఓలా విద్యుత్ ఆధారిత స్కూటర్ చాలా ఫేమస్ అయింది. కానీ కాలక్రమంలో ఓలా స్కూటర్లలో లోపాలు వెలుగుచూశాయి. తరచుగా మరమ్మతులు చేయించుకోవాల్సి రావడంతో ఓలా స్కూటర్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కర్ణాటకలో ఓ కస్టమర్ ఏకంగా ఓలా షోరూంకే నిప్పు పెట్టాడు. 

చివరికి స్టాక్ మార్కెట్లో కూడా ఓలా షేర్లు పతనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే... సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద సుత్తి పట్టుకుని ఓలా స్కూటర్ ను కసిదీరా బాదుతుండడం ఆ వీడియోలో చూడొచ్చు. చుట్టూ జనాలు గుమికూడి ఆసక్తిగా తిలకిస్తుండగా... ఆ వ్యక్తి ఓలా స్కూటర్ ను ముక్కలు ముక్కలు చేశాడు. అతడి ఆగ్రహానికి కారణం.... ఆ ఓలా స్కూటర్ రిపేరుకు రూ.90 వేలు ఖర్చవడమే కారణమట! 

కాగా, నెటిజన్లు ఈ వీడియోకు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు.
Go Back to Shorts
Ola Scooter
Video
Repair
Social Media

More Telugu News