అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి
Advertisement

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి

Hyderabadi dead in America road accident
  • కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో నివాసముంటన్న సందీప్ కుమార్ కుటుంబం
  • రెండెళ్ల క్రితం ఎమ్మెస్ కోసం ఒహియో వెళ్లిన సందీప్ కుమార్
  • స్నేహితుడిని కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్‌కు చెందిన యువకుడు సందీప్ కుమార్ యాదవ్ మృతి చెందాడు. సందీప్ కుమార్ రెండేళ్ళ క్రితం అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 17న రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో వెళుతున్నాడు.

ఈ సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో ఉన్న స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకు మృతి చెందిన విషయం తెలియడంతో కుత్బుల్లాపూర్‌లోని ఆయన కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

తన కొడుకు మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, సందీప్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. తండ్రి పేరు రాం ఆశిష్. వీరి కుటుంబం కుత్బుల్లాపూర్ డివిజన్‌లోని పద్మానగర్ ఫేజ్-2లో నివాసం ఉంటోంది. రాం ఆశిష్ కు ఇద్దరు కొడుకులు కాగా, చిన్న కుమారుడు సందీప్ కుమార్.
Advertisement
USA
Hyderabad
Telangana
Death

More Telugu News