పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనంటూ హైవేపై బైఠాయించిన అఘోరి.. వీడియో ఇదిగో!
- మంగళగిరి హైవేపై అఘోరి హల్ చల్
- వీడియో తీసినందుకు జర్నలిస్ట్ పై దాడి
- స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా చేయిచేసుకున్న అఘోరి
అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్టుపై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.