మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?

17-11-2024 Sun 19:11 | Offbeat
Advertisement
  • శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం గుండె
  • ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేసే అవయవం
  • పరిస్థితిని బట్టి గుండె కొట్టుకునే వేగంలో పెరుగుదల, తగ్గుదల
Advertisement
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. మిగతా అవయవాల్లో ఏమైనా తేడాలు వచ్చినా... శరీరం కొంతవరకు తట్టుకోగలదు. కానీ గుండె పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా... శరీరంలోని అన్ని అవయవాలు, భాగాలపై ప్రభావం పడుతుంది. అలాంటి గుండె రోజూ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా?

పరిస్థితిని బట్టి మారినా... 
మన మూడ్‌ ను, బయటి పరిస్థితులను బట్టి గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తుంటాయి. విశ్రాంతిగా కూర్చున్నప్పుడు, మనకు నచ్చిన పనిలో ఉన్నప్పుడు కాస్త నిదానంగా కొట్టుకునే గుండె... వేగంగా పరుగెత్తినప్పుడు, కోపంగా, భయంతో ఉన్నప్పుడు విపరీతమైన వేగంతో కొట్టుకుంటూ ఉంటుంది. 

ఎండ, వేడి, చలి వంటి వాతావరణ పరిస్థితుల్లో... వివిధ మానసిక ఉద్వేగాల సమయంలో... శరీరంలో అనారోగ్య పరిస్థితులలో... ఇలా ఎన్నో సమయాల్లో గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. వీటన్నింటినీ సగటుగా తీసుకుని, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందనే దానిపై అమెరికాలోని రట్గర్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

ఆ అధ్యయనం వివరాల మేరకు...
  • ఆరోగ్యవంతులైన యుక్త వయసు వారి గుండె నిమిషానికి 60 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. అదే చిన్న పిల్లల్లో ఇది 70 నుంచి 150 వరకు ఉంటుంది. వారి వయసు పెరిగిన కొద్దీ వేగం తగ్గుతుంది.
  • ఈ క్రమంలో శాస్త్రవేత్తలు నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకోవడాన్ని సగటు ప్రామాణికంగా తీసుకున్నారు.
  • దీని ప్రకారం గుండె ఒక రోజులో... ఒక లక్షా 800 సార్లు కొట్టుకుంటుంది. ఒక ఏడాదిలో 3,67,92,000 (మూడు కోట్ల 67 లక్షల 92 వేల) సార్లు కొట్టుకుంటుంది.
  • ఒక మనిషి జీవితకాలం 75 ఏళ్లు అనుకుంటే... 275,94,00,000 సార్లు (275 కోట్ల 94 లక్షల సార్లు) గుండె కొట్టుకుంటుంది.
  • మన గుండె ఇంత కష్టపడుతూ మనం ప్రాణాలతో ఉండేలా చేస్తుంది. అలాంటప్పుడు గుండెను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా! అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Advertisement
HeartbeatHealthoffbeatScienceHeart

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more