మిస్ యూనివర్స్ గా 21 ఏళ్ల డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా థెల్విగ్
Add ap7am to your home Screen

మిస్ యూనివర్స్ గా 21 ఏళ్ల డెన్మార్క్ బ్యూటీ విక్టోరియా థెల్విగ్

Victoria Theilvig crowns Miss Universe 2024 title
  • మెక్సికో దేశంలో మిస్ యూనివర్స్ పోటీలు
  • విశ్వసుందరి కిరీటం కైవసం చేసుకున్న విక్టోరియా కెజార్ హెల్వింగ్
  • డెన్మార్క్ దేశానికి బ్యూటీ పేజెంట్ లో ఇదే తొలి టైటిల్
డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్వింగ్ మిస్ యూనివర్స్-2024 కిరీటం కైవసం చేసుకుంది. ఈ డెన్మార్క్ బ్యూటీ వయసు 21 సంవత్సరాలు. అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ దేశానికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది విశ్వసుందరిగా నిలిచిన విక్టోరియా థెల్విగ్ కు గతేడాది మిస్ యూనివర్స్ గా గెలిచిన షెన్నిస్ పలాసియస్ (నికరాగువా) కిరీటధారణ చేసింది. 

ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా మెక్సికో సుందరి మరియా ఫెర్నాండా బెల్ ట్రాన్, సెకండ్ రన్నరప్ గా నైజీరియా ముద్దుగుమ్మ చిడిమ్మా అడెట్షినా ఎంపికయ్యారు. 

కాగా, ఈ విశ్వసుందరి పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిస్ ఇండియా (యూనివర్స్) రియా సింఘా టాప్-12లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రాథమిక రౌండ్లలో రాణించినప్పటికీ, ఫైనల్ రౌండ్ చేరేందుకు ఆ ప్రతిభ సరిపోలేదు. 

ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-12లో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందినవారే. ఈ అందాల పోటీలు మెక్సికో దేశంలో జరిగాయి.
Advertisement
Miss Universe-2024
Victoria Kjær Theilvig
Denmark
Mexico

More Telugu News