BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ ఆత్మీయంగా... వీడియో ఇదిగో!

Rajendra Prasad met BR Naidu
షార్ట్స్‌లో చూడండి
టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితులవడం తెలిసిందే. కొన్నిరోజుల కిందటే ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో, సినీ నటుడు రాజేంద్రప్రసాద్... బీఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

తనకోసం వచ్చిన రాజేంద్రప్రసాద్ ను చూడగానే బీఆర్ నాయుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనుబంధం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం, బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
BR Naidu
Rajendra Prasad
TTD Chairman
TV5
Tollywood

More Telugu News