షోలాపూర్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం
- షోలాపూర్ అభ్యర్థి చేతన్ తరఫున మంత్రి ప్రచారం
- చేతన్ చాలా మంచి వ్యక్తి... ఓటేసి గెలిపించాలన్న కోమటిరెడ్డి
- తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న మంత్రి
కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. కోట్లాది మంది మహిళలు ఇప్పటి వరకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినట్లు చెప్పారు. తాము రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.