ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Advertisement

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Telangana medical student dies in Philippines
  • సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ మృతి
  • ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని
  • పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె రూమ్ కి వెళ్లిన  ప్రెండ్స్ 
  • అప్పటికే శవమై కనిపించిన స్నిగ్ధ
  • పటాన్‌చెరులోని తల్లిదండ్రులకు సమాచారం అందించిన స్నేహితులు
ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు.

వారు వెళ్లేసరికి ఆమె గదిలో శవమై కనిపించారు. వారు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Advertisement
Telangana
Death
Hyderabad

More Telugu News