నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు
- రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- చంద్రబాబు, కుటుంబ సభ్యులపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు
- పవన్ కల్యాణ్ గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని కూడా ఫిర్యాదు
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని బుధవారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ సాయినాథ్‌కు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లోనూ ఇంకొక ఫిర్యాదు నమోదయింది.