నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్... కన్నీరుమున్నీరైన తల్లి... ఇదిగో వీడియో
- లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
- జుబ్లీహిల్స్‌లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్
- నరేందర్ రెడ్డి భార్య శృతి, తల్లికి ధైర్యం చెప్పిన కేటీఆర్
నరేందర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్... భార్య శృతి, తల్లిని కలిసి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌ను చూసి పట్నం నరేందర్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. కేటీఆర్ ఆమె పక్కన కూర్చొని భుజం తడుతూ ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.