బీజేపీని కుక్కతో పోల్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
- బీజేపీని కుక్కలా మార్చే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే
- ఓబీసీలంటే బీజేపీకి ఎంతమాత్రమూ గౌరవం లేదన్న కాంగ్రెస్ చీఫ్
- ఓబీసీలను కుక్కలు అంటున్న బీజేపీకి దాని స్థానమేంటో చెప్పే సమయం వచ్చిందన్న పటోలే
- పటోలే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత కిరిట్ సోమయ
మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే.. పలు అబద్ధాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ నేతలు తమనుతాము దేవుడిగా, విశ్వగురుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫడ్నవీస్ కూడా తనకు తాను దేవుడినని అనుకుంటున్నారని విమర్శించారు.
నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ తీవ్రంగా స్పందించారు. ఓటమితో నిరాశ, నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు బీజేపీ వారిని కుక్కలుగా పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. అధికార మహాయుటి, ప్రతిపక్ష మహావికాశ్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా కనిపించడం లేదు.