Mahesh Babu p: మహేష్‌బాబు.పి దర్శకత్వంలో రామ్‌ పోతినేని

డబుల్ ఇస్మార్ట్‌ తరువాత రామ్ పోతినేని ఏ చిత్రం అంగీకరించలేదు. తాజాగా ఆయన మహేష్‌బాబు దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. సందీప్‌ కిషన్‌తో రారా కృష్ణయ్య,  అనుష్క, నవీన్‌ పొలిశెట్టిలతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేష్‌బాబు.పి డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని పాపులర్‌ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. 

మేకర్స్‌ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విజయ దశమి పర్వదినాన విడుదల చేశారు. హీరోగా రామ్ పోతినేనికి కెరీర్‌లో ఇది 22వ చిత్రం అవుతుంది. ఈచిత్రంలో రామ్‌ సరికొత్త అవతార్‌తో కనిపించనున్నాడని తెలిసింది. యాక్షన్‌తో పాటు వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ర్యాపో 22 అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్.

నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని, రామ్ పోతినేనితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుందని, హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ తెలిపారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు
Mahesh Babu p
Ram Pothineni
Rapo22
Hero ram new film
Mythri Movie Makers.
Mahesh Babu
P Mahesh Babu
Tollywood

More Telugu News