ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ.. ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు.. ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి భారీ ఆదాయం!

11-10-2024 Fri 11:23 | Andhra
Advertisement
  • ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త‌ మద్యం పాలసీ అమలు
  • మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కొన‌సాగుతున్న‌ ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ 
  • ద‌ర‌ఖాస్తుకు నేడే ఆఖ‌రి గ‌డువు
  • గురువారం రాత్రి 8 గంటల వరకు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు 65,629 
  • త‌ద్వారా ప్రభుత్వ ఖ‌జానాకు రూ.1,312.58 కోట్ల ఆదాయం
Advertisement
ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త‌ మద్యం పాలసీ అమలు కానుండగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ కొన‌సాగుతోంది. ద‌ర‌ఖాస్తుకు నేడే ఆఖ‌రి గ‌డువు. ఇక‌ గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు వెల్ల‌డించారు. ఇందులో నిన్న‌ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 7,920 దరఖాస్తులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

కాగా, ఒక్కొ ద‌ర‌ఖాస్తుకు నాన్‌ రిఫండబుల్‌ రూపంలో రూ.2ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తు ఫీజు ఉంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖ‌జానాకు ఏకంగా రూ.1,312.58 కోట్ల ఆదాయం వ‌చ్చి చేరింది.

దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు కావటంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు.

ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 80, 81 దుకాణాలకు ఒక్కొ ద‌రఖాస్తులే వ‌చ్చిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు అమరాపురంలోని 84వ దుకాణానికి కూడా ఒక‌టే టెండర్ వ‌చ్చింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని 8, 9 నంబర్ల దుకాణాలకు కేవలం ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. 

అదేవిధంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏకంగా నాలుగు (175, 182, 183, 187) దుకాణాలకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రిలో 26, 28 నంబరు దుకాణాలది ఇదే ప‌రిస్థితి. అటు అనంతపురం జిల్లా పామిడిలోని 66, పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని 98వ నంబరు దుకాణాలకు ఒక్కొ ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Liquor Shop Tenders in APAndhra Pradesh

More Telugu News

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52
..more