సాహితి ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ!
- ప్రీలాంచింగ్ ఆపర్ల పేరుతో మోసం
- వేలాది మంది నుంచి సుమారు రూ.2,500 కోట్ల వసూలు
- ప్లాట్లను అప్పగించకుండా మోసగించినట్లు సాహితీ సంస్థపై ఆభియోగాలు
- 2022లోనే కేసు నమోదు చేసి లక్ష్మీనారాయణ అరెస్టు చేసిన పోలీసులు
- తాజాగా మనీలాండరింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ
ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆయనను ఆదివారం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే లక్ష్మీనారాయణ అరెస్టుపై అధికారికంగా ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేయలేదు.