నేను కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?: అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి ఫైర్
- దేహం పెరిగినట్టుగా మెదడు పెరగలేదన్న విజయసాయి
- మీ చేష్టలు వింతగా ఉంటాయని ఎద్దేవా
- మోకాలికి, బోడి గుండుకు లంకె పెడుతుంటావని విమర్శ
విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా... నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో...ఆన్... నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా" అని ట్వీట్ చేశారు.