దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
- గత రికార్డుల ప్రకారం 65 ఎకరాలుగా ఉందని పిటిషన్
- విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. ఈ క్రమంలో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.