భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ. 1200 పెరుగుదల
- రెండు నెలల గరిష్ఠాన్ని తాకిన బంగారం ధరలు
- దేశీయంగా ఊపందుకున్న కొనుగోళ్లు
- గత నాలుగు రోజుల్లో రూ. 5,200 పెరిగిన వెండి ధర
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న మరోమారు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో నిన్న కిలో వెండిపై రూ. 2 వేలు పెరిగి రూ. 89 వేలకు చేరింది. గత నాలుగు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,200 పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో ఈ ధర రూ. 95 వేలుగా నమోదైంది.