గుంటూరులో సైనైడ్ హత్యలు... మహిళల గ్యాంగ్ క్రూరత్వం వెలుగులోకి..!

07-09-2024 Sat 08:39 | Andhra
Advertisement
  • ముగ్గురు లేడీ కిల్లర్‌లను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
  • నిందితుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి 
  • డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైనైడ్‌తో సైలెంట్‌గా హత్యలు చేసిన మహిళా గ్యాంగ్
Advertisement
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ముగ్గురూ మహిళలు కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నిందితుల వివరాలు, వారు నేరాలు చేసిన విధానం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఎం వెంకటేశ్వరి గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె తల్లి రమణమ్మతో కలిసి నేరాలకు పాల్పడింది. 

తల్లి, కూతురు ఇద్దరూ చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బు తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగిన వారికి కూల్ డ్రింక్ లు, ఆహారం, మత్తు పానీయాల్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేస్తారు. ఇటీవల తల్లీకుమార్తెలు ఉంటున్న ఇంటి సమీపంలో ఉండే మునుగప్ప రజినీ కూడా ఈ ముఠాలో చేరింది. ఈ ముగ్గురు మహిళలు అదే ప్రాంతంలో నివాసముండే నాగుల్‌బీని జూన్ నెలలో బయటకు తీసుకొచ్చి చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి బ్రీజర్ లో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేశారు. 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులకు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మృతురాలు నాగూర్‌బీ, రజని మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, వారు చెప్పిన విషయాలతో పోలీసులే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ముగ్గురూ కలిసి ఇప్పటి వరకూ ముగ్గురు మహిళలు, ఒక పురుషుడికి సైనైడ్ ఇచ్చి హత్య చేసి వారి వద్ద నుండి నగదు, నగలు దోచుకున్నట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా మరో ముగ్గురు మహిళలను ఇదే తరహాలో సైనైడ్ కలిపి హత్య చేయడానికి ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో వారు ప్రాణాలతో బయటపడ్డారని ఎస్పీ తెలిపారు.
Advertisement
Guntur DistrictCrime Newsmurder case

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more