బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి మరోసారి భారీ వర్షాల అలర్ట్

05-09-2024 Thu 22:18 | Andhra
Advertisement
  • ఏపీకి వర్ష సూచన జారీ చేసిన ఐఎండీ అమరావతి
  • ఈ నెల 8 వరకు భారీ వర్షాలు
  • గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
Advertisement
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది.

సెప్టెంబరు 5వ తేదీ

  • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని... మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 
  • దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
  • రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించింది.
సెప్టెంబరు 6

  • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.  
  • దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరి కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
  • రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించింది.

సెప్టెంబరు 7

  • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 
  • దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
  • రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించింది.

సెప్టెంబరు 8

  • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 
  • దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
  • రాయలసీమలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.







Advertisement
AP RainsIMD AmaravatiLow PressureBay Of BengalAndhra Pradesh

More Telugu News

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37
..more