1500 ఐఫోన్లు చోరీ.. ఎలా దొంగిలించారంటే?
- మధ్యప్రదేశ్‌లో రూ.11 కోట్ల విలువైన ఫోన్లు చోరీ
- ఆగస్టు 15న గురుగ్రామ్ నుంచి చెన్నైకి వెళ్తున్న కంటెయినర్ నుంచి దొంగతనం
- డ్రైవర్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం
- ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు
ముగ్గురు పోలీసులు నిర్లక్ష్యం వహించారని తేలడంతో మధ్యప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు శనివారం చర్యలు తీసుకున్నారు. ఒక అధికారిని సస్పెండ్ చేయగా.. మిగతా ఇద్దరిని నాన్-ఫీల్డ్ డ్యూటీలకు అటాచ్ చేశారు.
ఐఫోన్ల చోరీ ఘటనపై నర్సింగ్‌పూర్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ స్పందించారు. సాగర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని, బండారి స్టేషన్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసును పరిష్కరించడంలో కానిస్టేబుల్ రాజేశ్ పాండే అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు వివరించారు. యాపిల్ ఫోన్ల దొంగతనంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.