బెంగళూరు నుంచి పులివెందులకు వస్తున్న జగన్
- కాసేపట్లో కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్
- మూడు రోజుల పాటు కొనసాగనున్న జగన్ పర్యటన
- సోమవారం రాత్రి తిరిగి తాడేపల్లికి పయనం
అనంతరం పార్టీ శ్రేణులతో కాసేపు గడిపి గొందిపల్లికి చేరుకుంటారు. కడప మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. కొత్త దంపతులను ఈ సందర్భంగా జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. రాత్రికి పులివెందులలో జగన్ విశ్రాంతి తీసుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు రాత్రికి ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. సెప్టెంబర్ 4న ఆయన లండన్ కు వెళ్లే అవకాశం ఉంది.