Advertisement

బాలీవుడ్ నటుడిపై సిద్దూ జొన్నలగడ్డ ఫైర్

Siddhu Jonnalagadda fires on Arshad Warshi
  • ప్రభాస్ లుక్ పై అర్షద్ వార్సీ విమర్శలు
  • కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్ మాదిరి ఉందని వ్యాఖ్య
  • సినిమాల సక్సెస్ కు మించిన స్టార్ డమ్ ప్రభాస్ దన్న సిద్దూ
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి' చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో మరో సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని అర్షద్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో సిద్దూ జొన్నలగడ్డ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అభ్రిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని... మన అభిరుచికి అనుగుణంగా ఒక్కో నటుడిని, ఒక్కో చిత్రాన్ని ఇష్టపడుతుంటామని సిద్దూ చెప్పాడు. నచ్చని వాటిని విమర్శిస్తుంటామని... అయితే, విమర్శలను ఎలా వ్యక్తపరుస్తున్నామనేది ముఖ్యమని అన్నాడు. నిర్మాణాత్మక, వివరణాత్మకమైన విమర్శలు చేస్తే తప్పులేదని... అయితే, జోకర్ లాంటి పదాలను ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు. 'కల్కి' సినిమా అంటే జోక్ కాదని... రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సూపర్ హిట్ మూవీ అని చెప్పాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక పెద్ద స్టార్ అని... సినిమాల సక్సెస్ కు మించిన స్టార్ డమ్ ఆయనకు ఉందని తెలిపాడు. ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడుకుందామని అర్షద్ వార్సీకి హితవు పలికాడు.


Advertisement
Siddhu Jonnalagadda
prabhas

More Telugu News