స్వచ్ఛ బయో ఎంవోయూ... సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

20-08-2024 Tue 19:08 | Telangana
Advertisement
  • స్వచ్ఛ బయో సంస్థతో ప్రభుత్వం రూ.1000 కోట్ల ఎంవోయూ
  • సంస్థలో సీఎం సోదరుడు డైరెక్టర్‌గా ఉన్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు
  • పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఈడీని కోరిన బీఆర్ఎస్
Advertisement
అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్... ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించి, రసీదు ఇచ్చింది. స్వచ్ఛ బయో డైరెక్టర్‌లలో ఒకరు స్వయానా సీఎం సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని, ఇది క్విడ్ ప్రోకో అని బీఆర్ఎస్ ఆరోపించింది. స్వచ్ఛ బయో డైరెక్టర్లలో ఒకరు అనుముల జగదీశ్వర్ రడ్డి కావడం ఆందోళన కలిగించే అంశమని, ఇది ఈ ఎంవోయూ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా ఉందని ఈడీకి రాసిన లేఖలో పేర్కొంది.

అమెరికాలోని ఫిలడెల్పియాలో సీఎం అధికారిక పర్యటనకు కేవలం 15 రోజుల ముందు స్వచ్ఛ బయోను తెరపైకి తీసుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిజిస్టర్ అయిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి క్రియాశీల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని, ఇది షెల్ కంపెనీ అని ఆరోపించింది.

ఈ కంపెనీని అమెరికాలోనే ఎందుకు ప్రకటించారు? ప్రయోజనం ఏమిటి? ఈ కంపెనీలో విదేశీ నిధులు ఉన్నాయా? మనీ లాండరింగ్‌ ఉందా? అనే అంశాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ఎంవోయూపై సంతకం చేసే సమయంలో రేవంత్ రెడ్డి పక్కన హర్ష పసునూరి ఉండటంపై కూడా తన ఫిర్యాదులో బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది.

ఎంవోయూపై సంతకాలు చేసిన సమయంలో సీఎం పక్కన ఉన్న వ్యక్తి పసునూరి హర్ష అని వెల్లడించింది. హర్ష పసునూరి, సీఎం సోదరుడు తమ ఆర్థిక పరిస్థితిని వివరించాలని, రూ.1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారో చెప్పాలని డిమాండ్ చేసింది. విషయమై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరింది.

ఇది పూర్తి అవినీతిమయమైన ఎంవోయూ అని, కాబట్టి అధికారులు తమ ఫిర్యాదును స్వీకరించి స్వచ్ఛ బయో డైరెక్టర్లతో పాటు రేవంత్ రెడ్డిపై న్యాయ విచారణ జరపాలని కోరింది.
Advertisement
BRSRevanth ReddyCongress

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more