జియో అందిస్తున్న ఈ ఆఫర్‌తో 14 రోజులపాటు అపరిమిత 5జీ డేటా

20-08-2024 Tue 17:32 | Business
Advertisement
  • ఇటీవలే రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసిన రిలయన్స్ జియో
  • అర్హులైన కస్టమర్లకు 5జీ అపరిమిత డేటా
  • జియో యాప్ సేవలను కూడా పొందే అవకాశం
Advertisement
కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. అయితే ఇటీవల టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచడంపై కస్టమర్లు పెదవి విరుస్తున్నారు.  ఈ నేపథ్యంలో, ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.

జియో అందిస్తున్న చౌకైన ఆఫర్లలో ఈ ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో యాప్‌ సర్వీసులు కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా యాప్‌ సేవలు లభిస్తాయి.

కాగా రూ.198 రీఛార్జ్ ప్లాన్‌తో సమానమైన సేవలను 28 రోజులపాటు పొందాలనుకుంటే రూ.349 ప్లాన్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల ప్లాన్‌ను నెలలో రెండు సార్లు రీచార్చ్ చేయించుకుంటే రూ.396 అవుతుంది. దానితో పోల్చితే రూ.349 ప్లాన్ ఉత్తమం.
Advertisement
Reliance JioJio RechargeJio OfferRecharge Offers

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more