రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి!: బీఆర్ఎస్
- హైడ్రాను ఉద్దేశిస్తూ తాజాగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్
- పట్నం మహేందర్ రెడ్డి అక్రమ రిసార్ట్‌పై చర్యలు ఎప్పుడంటూ ప్రశ్న
- మొదట కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చండన్న బీఆర్ఎస్
ఈ నేపథ్యంలో హైడ్రాను ఉద్దేశిస్తూ తాజాగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న హైడ్రాను రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దని బీఆర్ఎస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హితవు పలికింది.
'డియర్ హైడ్రా! కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఈ అక్రమ రిసార్ట్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు? రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి! మొదట కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చండి' అని బీఆర్ఎస్ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జత చేసింది.