తనను చంపేస్తారన్న భయంతో వణికిపోతున్న సౌదీ రాజు!

Saudi prince Mohammed bin Salman life in danger
  • అమెరికా చట్ట సభ్యుల వద్ద ఆందోళన వ్యక్తం చేసిన రాజు
  • ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన పీకల మీదకు తెచ్చిందని వాపోయిన సల్మాన్
  • గతంలో ఇజ్రాయెల్‌తో ఇలాంటి ఒప్పందమే చేసుకుని హత్యకు గురైన ఇజ్రాయెల్  నేత హత్య ప్రస్తావన
తన వ్యక్తిగత భద్రతపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా చట్ట సభ్యులతో చర్చల సందర్భంగా  తన హత్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికన్ వెబ్‌సైట్ ‘పొలిటికో’ పేర్కొంది. 

పొలిటికో కథనం ప్రకారం.. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదికి తెస్తుందని అమెరికా చట్టసభ్యుల వద్ద మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టినట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం చేసుకుని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.   

అంతేకాదు, సాదత్‌ను రక్షించేందుకు అమెరికా తీసుకున్న చర్యల గురించి ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఆయన ఎదుర్కొనే బెదిరింపులు, గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించినట్టు తెలిసింది.
Advertisement
Mohammed bin Salman
Saudi Arabia
Israel
USA
Assassination

More Telugu News