ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే: సీఎం చంద్రబాబు

15-08-2024 Thu 14:21 | Andhra
Advertisement
  • ఏపీలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం
  • గుడివాడలో పేదలతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, భువనేశ్వరి
  • ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని చంద్రబాబు ఆకాంక్ష
  • విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • మంచి పని కోసం ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని వెల్లడి
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమేనని వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు. 

ఆయన డొక్కా సీతమ్మ గురించి కూడా ప్రస్తావించారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో  మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. 

ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్న క్యాంటీన్లను తీసుకువస్తే, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. 

"రద్దు చేయవద్దు... క్యాంటీన్లకు మీ పేరే పెట్టుకుని వాటిని కొనసాగించండి... పేదలకు పట్టెడన్నం పెట్టండి అని ఆనాడు కోరాం. ఒకవేళ మీరు అన్నం పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం. కానీ గత ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారు. ఇక అలాంటి పరిస్థితి రాదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు తీసుకువస్తాం. 

పేదవాళ్లకు తిండిపెట్టడం మనందరి కనీస బాధ్యత. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నా. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి" అని చంద్రబాబు వివరించారు.
Advertisement
ChandrababuAnna CanteenGudivadaTDPAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more