సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. గ్రీస్ లో విహారయాత్ర?
- నాలుగు రోజుల వ్యవధిలో సేమ్ లొకేషన్ లో ఫొటోలు
- దీంతో ఇద్దరూ కలిసే వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- గత నెలలోనే భార్య నటాషాతో విడిపోయిన పాండ్యా
జాస్మిన్ వాలియా ఎవరంటే..
బ్రిటన్ కు చెందిన జాస్మిన్ వాలియా నటి, సింగర్, యూట్యూబర్.. నివాసం ఇంగ్లాండ్ లోని ఎసెక్స్. టీవీ షోలు, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు ఆల్బమ్ లు చేసింది. ఆమె పాడిన ‘బామ్ డిగీ’ పాటను బాలివుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్ సింగర్ ఆసిమ్ రియాజ్ తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది.
నటాషాతో విడిపోయిన పాండ్యా
సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా.. గత నెలలో తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఈ జంట సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. కొడుకు అగస్త్యను తీసుకుని నటాషా తన మాతృదేశం సెర్బియాకు వెళ్లిపోయింది. అప్పటినుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది.