వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి రూ.36 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
Advertisement

వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి రూ.36 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ

AP CM Chandrababu Pledge For Input Subsidy For Farmers
  • విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు
  • వంద శాతం ఈ క్రాపింగ్ నమోదు చేయాలి
  • డ్రోన్ వినియోగాన్ని పెంచాలని సూచించిన సీఎం
జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ-క్రాపింగ్ కింద నమోదు చేయాలి ఆదేశించారు.

డ్రోన్ల వినియోగాన్ని పెంచాలి
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లను మాత్రమే వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్‌ను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మైక్రో ఇరిగేషన్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసేలా జియో ట్యాగ్ చేయాలని చంద్రబాబు సూచించారు. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Advertisement
AP Farmers
Chandrababu

More Telugu News