Congress: మమ్మల్ని ఎలా బద్నాం చేయాలా? అని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్

Chamala Kiran Kumar Reddy lashes out at BRS
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారని, తమను ఎలా బద్నాం చేయాలా? అనే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు.

తెలంగాణకు పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు దానిని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ వడ్డీలకు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వంటి వనరులను ఉపయోగించుకోలేదని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు అందర్నీ ఆహ్వానిస్తున్నామన్నారు. గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారాలకు అనుమతులు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం, తెలంగాణ సంపదను పెంచడమే తమ లక్ష్యమన్నారు.
Go Back to Shorts
Congress
BRS
KTR
Revanth Reddy
Kiran Kumar Reddy

More Telugu News