మధ్యప్రదేశ్‌లో విషాదం... ఆలయ గోడ కూలి 9 మంది చిన్నారుల సజీవ సమాధి
- షాపూర్‌లోని హర్దౌల్ బాబా ఆలయంలో ఘటన
- చిన్నారులందరూ 15 ఏళ్ల లోపు వారే
- మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం
- ఇటీవల రేవా జిల్లాలో గోడ కూలి నలుగురు చిన్నారుల మృత్యువాత
చిన్నారుల మృతి తనను కలచివేసిందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల సాయం ప్రకటించారు.
రేవా జిల్లాలో ఇటీవల గోడ కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్కూలు నుంచి వస్తున్న 5 నుంచి ఏడేళ్ల వయసున్న చిన్నారులపై గోడ కూలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గోడ కూలిన ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతలోనే సాగర్ జిల్లాలో ఘటన జరగడం అందరినీ కలచివేసింది.