ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల బడ్జెట్
- వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ
- ట్రోఫీ నిర్వహణకు బడ్జెట్ను ఆమోదించిన ఐసీసీ
- అదనపు ఖర్చులకు మరో రూ.34 కోట్లు కేటాయించినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడి
ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా ఇటీవల రాబోయే ఆసియా కప్ టోర్నీ వేదికలను నిర్ణయించడంలోనూ కీలక పాత్ర పోషించారు. టీ20 ఫార్మాట్ లో జరిగే 2025 ఆసియా కప్ ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. అలాగే 2027 ఆసియా కప్ అనేది 50 ఓవర్ల ఫార్మాట్ లో బంగ్లాదేశ్ లో జరగనుంది.
దాయాదుల పోరు వల్లే ఐసీసీకి లాభాలు
భారత్- పాకిస్థాన్ మ్యాచుల వల్లే ఐసీసీకి లాభాలు వస్తాయని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మళ్లీ ఒకే గ్రూప్లో ఉంటాయని సూపర్ ఫోర్ దశలో కూడా తలపడవచ్చని, రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తే మూడో మ్యాచ్ కూడా జరుగుతుందని తెలిపారు.
2023 ఆసియా కప్ నుంచి లాభాలు
గత ఆసియా కప్ సమయంలో గందరగోళం, చివరి నిమిషంలో వేదిక మార్పులు, అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ లాభాలు పొందడం గమనార్హం. 2023లో ఆసియా కప్ కి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత్, పాక్లో పర్యటించేందుకు నిరాకరించడంతో శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించారు. వర్షం కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఓ మ్యాచ్ రద్దయినప్పటికీ, టోర్నీ నిర్వహణ లాభాలు తెచ్చిపెట్టిందని జై షా తెలిపారు.