ఒలింపిక్ గ్రామంలో పీవీ సింధుతో కలిసి రామ్ చరణ్ సందడి

Ram Charan met PV Sindhu in Olympic village
పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు మెగా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్ తరలి వెళ్లింది. తాజాగా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుతో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. పీవీ సింధు... రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒలింపిక్ గ్రామం అంతా తిప్పి చూపించారు. 

ఈ సందర్భంగా రామ్ చరణ్ పెంపుడు శునకం రైమ్ ను సింధు ముద్దు చేశారు. మీరు ఎక్కడికి వెళ్లినా ఇది మీ వెంట ఉండాల్సిందేనా? అని రామ్ చరణ్ ను సింధు ప్రశ్నించగా... తప్పకుండా ఉండాల్సిందే అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు.

ఈ సందర్భంగా, ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో నెగ్గిన సింధును రామ్ చరణ్, ఉపాసన అభినందించారు.

ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం నాడు కూడా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన పారిస్ లోని సెన్ నది వద్ద దర్శనమిచ్చారు. ఒలింపిక్ టార్చ్ రెప్లికాను చేతబూనిన చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Ram Charan
PV Sindhu
Olympic Village
Paris Olympics
Mega Family

More Telugu News