కేసీఆర్ కు విశ్వసనీయత లేదు.. ఏమైనా చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు: ఈటల రాజేందర్

Etela Rajender fires on Revanth Reddy and KCR
  • అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ గెలిచిందన్న ఈటల
  • రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని విమర్శ
  • రుణమాఫీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టడం దారుణమని వ్యాఖ్య
అడ్డదారులు తొక్కి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడని.. అందుకే ఆయనకు ప్రజలు బొంద పెట్టారని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పారు.
Advertisement
Etela Rajender
BJP
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News