దేశ రాజధానిలో బుల్లెట్ బండిపై వచ్చి ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి.. వీడియో ఇదిగో!

దేశ రాజధానిలో బుల్లెట్ బండిపై వచ్చి ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి.. వీడియో ఇదిగో!

Girl on Bullet bike beats up autowala in Delhi
  • ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో ఘటన
  • దారికి అడ్డుగా ఉన్నాడంటూ ఆటోవాలను హాకీ కర్రతో కొట్టిన యువతి
  • తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారిన వైనం
  • యువతిని అడ్డుకున్న స్థానికులు, నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
ఢిల్లీ వీధుల్లో ఓ యువతి ఉన్మాదిలా మారి రెచ్చిపోయింది. ఓ ఆటోవాలాను పబ్లిక్‌గా హాకీ కర్రతో తలపై రక్తమోడేలా బాదింది. ఈ భయానక ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. నిహాల్ విహార ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం, స్కూలు పిల్లలను తీసుకుని వెళుతున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జాం కావడంతో ఆగిపోయాడు. అతడి వెనకే బుల్లెట్ బండిపై వస్తున్న యువతి తప్పుకోమని ఆటోవాలకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది. అయితే, ఆటోవాలా తప్పుకోకపోవడంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటోవాలాను తన హాకీ కర్రతో ఇష్టారీతిన కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారింది. 

ఆటోవాలాను కాపాడేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. యువతిని అడ్డుకున్నారు. ఈ వీడియో నెట్టింట కూడా సంచలనంగా మారింది. యువతి ఉన్మాదాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలంలో కూడా ఇలా గూండాగిరి చేసేవారిని అస్సలు ఉపేక్షించకూడదని అన్నారు. వీడియోను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు.
Advertisement
New Delhi
Crime News
Viral Videos
Girl Beats up Autowala

More Telugu News