ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు

Pullela Gopichand met AP CM Chandrababu in Delhi
  • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ
  • క్రీడాకారుల కోసం సమయం కేటాయింపు
  • చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో సమావేశాల కారణంగా తీరిక లేనప్పటికీ, ఆయన క్రీడాకారుల కోసం సమయం కేటాయించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరికొందరు క్రీడాకారిణులు కలిశారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందించారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాడ్మింటన్ క్రీడ తీరుతెన్నుల గురించి తెలుసుకున్నారు. క్రీడలకు తాము ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. మెరుగైన క్రీడా విధానాలతో ప్రతిభావంతులను తెరపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
Advertisement
Chandrababu
Pullela Gopichand
Badminton
TDP
Andhra Pradesh

More Telugu News