తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఏఐఎస్ శ్రీనివాసరాజు

Retd IAS Srinivas Raju as Telangana government adviser
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా వ్యవహరించనున్నారు.

ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం ఓఎస్డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్డీగా గీతే మహేశ్ బాబా సాహెబ్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్‌లను బదిలీ చేశారు.
Go Back to Shorts
Telangana
CS Santhi Kumari
IPS

More Telugu News