Bachhala Malli Glimpse: అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ మూవీ గ్లింప్స్ వచ్చేశాయ్.. మాస్ లుక్ అదుర్స్

అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బచ్చల మల్లి’ మూవీ గ్లింప్స్ ఆదివారం రిలీజ్ అయింది. ఇవాళ (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ వీడియోను విడుదల చేసింది. నరేశ్ మాస్ లుక్‌లో రఫ్‌గా కనిపించి అలరించాడు. ‘ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’ అంటూ మాస్ డైలాగ్ చెప్పిన తీరు సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సినీ ప్రియుల నుంచి చక్కటి స్పందన వస్తోంది.

కాగా 1990 దశకంలో జరిగిన నిజజీవిత ఘటనల ఆధారంగా ‘బచ్చల మల్లి’ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో అల్లరి నరేశ్ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా అలరించబోతున్నాడు. ఈ మేరకు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు గింప్స్ వీడియోలో చిత్ర బృందం పేర్కొంది.

ఇక హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుట్ట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.

Bachhala Malli Glimpse
Bachhala Malli Movie
Allari Naresh
Allari Naresh Birthday
Tollywood
Movie News

More Telugu News