కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్
- ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గంలో పయనం
- ఆలయం వద్ద స్వాగతం పలికిన అధికారులు
- ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాగా, పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.

