'క‌ల్కి' అద్భుతం: ర‌జ‌నీకాంత్‌

Rajinikanth Tweet on Kalki 2898 AD
  • ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో క‌ల్కి 2898 ఏడీ 
  • మొద‌టి ఆట నుంచే హిట్‌టాక్ సొంతం చేసుకున్న మూవీ
  • సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు
  • మూవీ చూసి 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించిన ర‌జ‌నీకాంత్‌
టాలీవుడ్ టాప్ హీరో ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో వ‌చ్చిన క‌ల్కి 2898 ఏడీ మూవీపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సినిమా చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు భార‌త సినిమాను మ‌రో మెట్టు ఎక్కించింద‌ని మెచ్చుకుంటున్నారు. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ విజ‌న్‌కు సెల్యూట్ చేస్తున్నారు. 

తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా మూవీ చూసి మెచ్చుకున్నారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా చిత్రం యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. కల్కి సినిమా చూశాన‌ని చెప్పిన ర‌జ‌నీ.. మూవీ ఎంతో అద్భుతంగా ఉంద‌న్నారు. ఇండియ‌న్ సినిమాని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లార‌ని ప్ర‌శంసించారు. చిత్రం భారీ విజ‌యం సాధించినందుకు నిర్మాత అశ్వన్ ద‌త్‌, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, హీరో ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకొణెతో పాటు చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అలాగే సెకండ్ పార్ట్ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు.
Go Back to Shorts
Rajinikanth
Kalki 2898 AD
Twitter

More Telugu News