తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Rains in Telangana for week days
తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
Go Back to Shorts
Rain
Telangana

More Telugu News