డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు
- నేడు వరుస సమావేశాలతో పవన్ బిజీ
- విజయవాడలో పవన్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన హోంమంత్రి అనిత
- డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన వైనం
- పవన్ ను కలిసిన విజయవాడ సీపీ, డీసీపీ
ఇక, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్ డీ రామకృష్ణ, డీసీపీ ఆదిరాజ్ రాణా కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. వారు పవన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ ఈ ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీకి హాజరైన పవన్ కల్యాణ్... అనంతరం టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.
