ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ నిర్మాతలు.. సాయంత్రం పవన్‌తో భేటీ
- సాయంత్రం నాలుగు గంటలకు పవన్‌తో సమావేశం
- హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు నిర్మాతలు
- చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లనున్న నిర్మాతలు
నేటి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ వారితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారు పవన్‌కు వివరిస్తారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుతోపాటు, థియేటర్ల సమస్యపైనా పవన్‌తో చర్చిస్తారు.