స్వల్ప శ్రేణి గగనతల రక్షణ మిసైళ్లను పరీక్షించనున్న డీఆర్‌డీఓ
- ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసం స్వల్ప శ్రేణి మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ
- త్వరలో ఎత్తైన ప్రదేశాల్లో మిసైళ్లను పరీక్షించనున్న వైనం
- చైనా, పాక్ దాడులను అడ్డుకునేందుకు వీలుగా మిసైళ్ల అభివృద్ధి
వివిధ రకాల స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు భారత్ ఆర్మీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వీటి అభివృద్ధి కోసం రూ.6,800 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్, చైనా నుంచి పొంచి ఉన్న గగనతల ప్రమాదాల నుంచి రక్షణ కోసం షోల్డర్ ఫైర్డ్ మిసైళ్లు అవసరమని ఆర్మీ భావిస్తోంది. వీటిని భుజంపై పెట్టుకుని ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత్ వద్ద స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ అన్నింటిలో.. లక్ష్యాలను గుర్తించి ఛేదించేందుకు అవసరమైన ఐఆర్ హోమింగ్ గైడెన్స్ వ్యవస్థ ఉంది.