మమ్మల్ని గెలిపించిన ప్రధాని మోదీకి థ్యాంక్స్: శరద్ పవార్ చురక
- మోదీ ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించిన చోట విజయం సాధించామన్న శరద్ పవార్
- అందుకే ప్రజలతో పాటు మోదీకి థ్యాంక్స్ చెబుతున్నట్లు వెల్లడి
- కూటమి గెలుపు ఆరంభమే... అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ... ప్రధాని రోడ్డు షో నిర్వహించిన ప్రతిచోట తాము గెలిచామన్నారు. అందుకే ప్రజలతో పాటు ప్రధానికీ థ్యాంక్స్ చెప్పడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. 'మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోదీకి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. కూటమి గెలుపుకు ఇది ఆరంభమేనని... అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.